మార్చి 6 నుంచి జూన్ 12 వరకు…“ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మార్చి 6 నుంచి జూన్ 12 వరకు…
“ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”

అయిదు దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్

ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖ గా వ్యవహరిస్తుంది.

🔹ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ
🔹ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం
🔹మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం
🔹మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం
🔹జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక


శాఖల వారీగా 10 వివిధ థీమ్ లతో 99 రోజుల కార్యక్రమం

  1. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్
  2. ఆరోగ్యం
  3. అరైవ్.. అలైవ్
  4. సంక్షేమం
  5. పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట
  6. రైతు సంక్షేమం.. వ్యవసాయం
  7. విద్య
  8. యువత.. క్రీడలు
  9. మహిళలు
  10. పర్యావరణం

మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు

99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్