హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలంపై తీవ్ర విమర్శలు చేశారు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…పోలీసులు.. …. నేతలు..

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలంపై తీవ్ర విమర్శలు చేశారు. హోంగార్డుల బదిలీల్లో అవకతవకలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా పోలీసు వాహనాన్ని, సిబ్బందిని హైదరాబాద్‌లో వాడుకుంటున్నారని ఆరోపించారు. గత నెలలో వీణవంకలో జరిగిన సంఘటనతో వీరి మధ్య వివాదం మొదలైంది. ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పోలీసుల తీరుపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు…