ప్రభుత్వ న్యాయవాదులకు గుడ్ న్యూస్

భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రభుత్వ న్యాయవాదులకు గుడ్ న్యూస్

కేంద్రప్రభుత్వం తరఫున వివిధ కోర్టుల్లో వాదించే న్యాయవాదుల ఫీజులను కేంద్ర న్యాయశాఖ భారీగా పెంచింది. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈసవరణ జరిగింది.

గ్రూప్-ఏ న్యాయవాదులకు ఫీజు ఒక కేసుకు రూ.13,500 నుంచి రూ.21,600కి పెరిగింది.

గ్రూప్-బీ, గ్రూప్ -సీ న్యాయవాదులకు ఫీజు రూ.9,000 నుంచి రూ.14,400కి పెరిగింది.

ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులకు లబ్ధి చేకూరనుంది.