వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.

భారత్ న్యూస్ గుంటూరు…వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబుపై పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.

మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చేపట్టిన ఆందోళన సందర్భంగా బారికేడ్లను తోసుకుంటూ వెళ్లిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే అంబటిపై కేసు నమోదు అయింది.

ఈ కేసును పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన పోలీసులు తాజాగా పీటీ వారెంట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

ఈ నెల 11వ తేదీలోపు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

రాంబాబును రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

మరోవైపు అంబటి రాంబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌తో పాటు కస్టడీ పిటిషన్‌లపై రేపు మొబైల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది…