భారత్ న్యూస్ శ్రీకాకుళం…కూటమి నాయకులకు ఆహ్వానం
రేపు పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
జయపురంలో ప్రారంభోత్సవాలు, రామకృష్ణాపురంలో శంకుస్థాపనలు
కోడూరు:
ఈ నెల 9వ తేదీ అనగా రేపు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోడూరు మండలంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సోమవారం ఉదయం 9గంటలకు కోడూరు మండలం జయపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మంజూరు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు రూ.14.3లక్షలతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. మాజీ ఎంపీ, జయపురం గ్రామానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ ఎంపీ లాడ్స్ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన రెండు శ్లాబు కల్వర్టులు, నాలుగు తూము కల్వర్టులు ప్రారంభిస్తారు. జిల్లా పరిషత్ 12శాతం త్రాగునీటి నిధులు రూ.12.50లక్షలతో నిర్మించిన 0.5 ఎం.ఎల్.డీ. మైక్రో ఫిల్టర్ కం ప్లాట్ ఫామ్ ప్రారంభిస్తారు.
అనంతరం 10:30 గంటలకు కోడూరు మండలం రామకృష్ణాపురంలో రూ.36లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
