భారత్ న్యూస్ శ్రీకాకుళం….మహిళా డీఎస్పీ కల్పనా వర్మ సస్పెండ్.
ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం, పోలీసు శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
చతిస్గడ్ : ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం, పోలీసు శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దంతెవాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ కల్పనా వర్మను తక్షణమే సస్పెండ్ చేస్తూ హోం శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.రాయ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త దీపక్ టాండన్‌తో డీఎస్పీ కల్పనా వర్మకు ఉన్న వివాదంపై ప్రభుత్వం అదనపు ఎస్పీ స్థాయి అధికారితో ప్రాథమిక విచారణ జరిపించింది. ఈ విచారణలో భాగంగా అధికారులు సుమారు 1,475 పేజీల సుదీర్ఘ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.తన హోదాను అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందడం. పోలీసు శాఖకు సంబంధించిన అత్యంత సున్నితమైన, రహస్య సమాచారాన్ని వాట్సాప్ చాట్స్ ద్వారా సదరు వ్యాపారవేత్తకు చేరవేయడం. అక్రమ పద్ధతుల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టడం. ఛత్తీస్‌గఢ్ సివిల్ సర్వీసెస్ నియమావళి, 1965ను ఉల్లంఘించడం.
వ్యాపారవేత్త దీపక్ టాండన్ చేసిన ఆరోపణలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. కల్పనా వర్మ తనను ‘ప్రేమ వల’ లో దించి 2021 నుంచి సుమారు రూ.2.5 కోట్లు వసూలు చేసినట్లు ఆయన గత డిసెంబర్ (2025) నెలలో ఫిర్యాదు చేశారు. ఇందులో రూ. 2 కోట్ల నగదుతో పాటు, ఒక లగ్జరీ కారు, రూ.12 లక్షల విలువైన డైమండ్ రింగ్, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన సోదరుడి పేరుతో హోటల్ ప్రారంభించేందుకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.విచారణ సమయంలో కల్పనా వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడం,వాట్సాప్ చాట్‌లలో కీలక సమాచారం బయటపడటంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సస్పెన్షన్ కాలంలో కల్పనా వర్మ ప్రధాన కార్యాలయం నవ రాయ్‌పూర్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటుంది. నిబంధనల ప్రకారం ఆమెకు జీవన భృతి అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఘటన పోలీసుల వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
