నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

..భారత్ న్యూస్ హైదరాబాద్….నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా, దట్టమైన పొగ బయటకు వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు, నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.