మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త ‘ప్రమాణ’ రాజకీయాలు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త ‘ప్రమాణ’ రాజకీయాలు.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ మారబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రమాణం చేయిస్తున్నారు. గతంలో కొందరు నేతలు గెలిచాక ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్లలో నమ్మకం కలిగించేందుకు ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే, బహిరంగంగా ప్రమాణాలు చేయించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.