పరీక్షాపే చర్చ.. విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ…

భారత్ న్యూస్ ఢిల్లీ…..పరీక్షాపే చర్చ.. విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పరీక్షల ముందు ఒత్తిడిలో ఉండే విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేలా ‘పరీక్షాపే చర్చా’ కార్యక్రమం ద్వారా వారితో సంభాషించారు. ఈ ఏడాది కూడా ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ, ‘పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను అందరూ చూడాలని ఆయన సూచించారు..