భారత్‌ ట్యాక్సీ సేవలు ప్రారంభం.. రెండేండ్లలో దేశవ్యాప్తంగా అమలు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….భారత్‌ ట్యాక్సీ సేవలు ప్రారంభం.. రెండేండ్లలో దేశవ్యాప్తంగా అమలు

సహకార యాజమాన్య నమూనాలో కేంద్రం సహకారంతో అమలవుతున్న భారత్‌ ట్యాక్సీ సేవలు గురువారం మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా ఈ సేవలను న్యూఢిల్లీలో ప్రారంభించారు.

ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సహకార వ్యవస్థలో ప్రయాణికులు చెల్లించిన చార్జీలను పూర్తిగా డ్రైవర్లే పొందవచ్చు.

ప్రైవేట్‌ క్యాబ్‌ సర్వీసులతో పోలిస్తే భారత్‌ ట్యాక్సీలో చార్జీలు 30 శాతం తక్కువగా ఉంటాయి. రెండేండ్లలో దేశ వ్యాప్తంగా భారత్‌ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.