ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి:

భారత్ న్యూస్ డిజిటల్ :నారాయణ పేట:తెలంగాణ:

“ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి:

…శాంతి భద్రతల పరిరక్షణకు నారాయణపేటలో భారీ ఫ్లాగ్ మార్చ్.

…అదనపు ఎస్పి MD రియాజ్ హుల్ హక్.
… డీఎస్పీ నల్లపు లింగయ్య…

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భద్రతా భరోసా కల్పించే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అదనపు ఎస్పి MD రియాజ్ హుల్ హక్ తెలిపారు.
బుధవారం సాయంత్రం నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసులు, TSSP బెటాలియన్ల పోలీసులతో కలిసి భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ఎస్పీ కార్యాలయం నుండి ప్రారంభమై ఓల్డ్ బస్టాండ్ నుండి మెయిన్ చౌక్, సరబ్ బజార్, పల్లా హనుమాన్ టెంపుల్, జంగిడి గడ్డ, మసుమల్లి దర్గా, అంబా భవాని టెంపుల్, మహంకాళి టెంపుల్, ఓల్డ్ బస్టాండ్ సత్యనారాయణ చౌరస్తా వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ… మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు, ఎన్నికల సమయంలో ఎవరూ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజల్లో నమ్మకం, భద్రతా భావం పెరుగుతుందని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ ప్లగ్ మార్చ్ లో CI శివ శంకర్, RI లు నరసింహ, విజయ్ భాస్కర్, ఎస్ఐ లు నరేష్, వెంకటేశ్వర్లు, రాముడు, కృష్ణ చైతన్య, రాజు, గాయత్రి, శిరీష జిల్లా పోలీసులు, TSSP బెటాలియన్ పోలీసులు తది తరులు పాల్గొన్నారు.