భారత్ న్యూస్ డిజిటల్:ఆదిలాబాద్:
” మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గది ప్రారంభం.
జిల్లా లో మహిళల భద్రతకు, రక్షణకు మొదటి ప్రాధాన్యత
ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిశీలన.
రిబ్బన్ కట్ నూతన గదిని ప్రారంభించిన మహిళా కానిస్టేబుల్
రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలని సూచన.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.
జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను కేటాయిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు. ఈరోజు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర పనుల నిమిత్తం ప్రత్యేకంగా నూతన గదిని జిల్లా ఎస్పీ శాస్త్రోక్తంగా, వేద మంత్రోచరణల నడుమ ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుల్ చే రిబ్బన్ కట్ చేపించి నూతన గదిని ప్రారంభించారు. అదేవిధంగా సిబ్బంది విశ్రాంతికి పురుషులకై ప్రత్యేకంగా మరొక విశ్రాంతి గదిని సైతం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ మరియు ఇచ్చోడ సిఐ బండారి రాజు కలిసి ప్రారంభించారు. మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలను చేపడుతున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకై షీ టీం ఆధ్వర్యంలో పోలీసు అక్క ప్రారంభించి చిన్నారులకు మరింత దగ్గర అయిందని, మహిళల పట్ల జరుగు నేరాలపై పాఠశాలలు కళాశాలలు గ్రామ గ్రామాల మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ చైతన్య పరిచయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించి రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలని, ఎలాంటి పెండెన్సీ లేకుండా బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ సిబ్బందిని కేటాయించి సమస్యల పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులు దర్యాప్తును పూర్తి చేసి కోర్టులలో చార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్ఐ రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
