రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్..

భారత్ న్యూస్ రాజమండ్రి…రైల్వే ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కాకినాడ టౌన్, తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. రైలు నంబర్ 07617 5 (14.02.2026) సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, తిరువణ్ణామలైకి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్ 07618 తిరువణ్ణామలై నుండి సోమవారం (16.02.2026) తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 8.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి వంటి పలు స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 1AC కమ్ 2AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి….