రైతు సంఘం నేత రేపల్లె రాజయ్య అస్తమయం

భారత్ న్యూస్ విజయవాడ…రైతు సంఘం నేత రేపల్లె రాజయ్య అస్తమయం

​కోడూరు/వి.కొత్తపాలెం: ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సీనియర్ రైతు సంఘం నేత రేపల్లె రాజయ్య గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కోడూరు మండలం, వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన ఆయన మృతి వార్త తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రజా ఉద్యమాల్లో, ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారంలో రాజయ్య గారు కీలక పాత్ర పోషించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల గ్రామస్థులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.