హైదరాబాద్‌లో విదేశీయుల వ్యభిచార ముఠా గుట్టురట్టు

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో విదేశీయుల వ్యభిచార ముఠా గుట్టురట్టు

చదువు పేరుతో వచ్చి దందా

మియాపూర్‌లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ బట్టబయలు

నిర్వాహకుడితో సహా ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసిన పోలీసులు

స్టూడెంట్ వీసాపై వచ్చి దందా నిర్వహిస్తున్న లైబేరియా జాతీయుడు

కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో వ్యభిచారం

నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించిన అధికారులు

మియాపూర్ పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌ కాలనీలో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టగా, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించారు.

ఈ రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇతడు 2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, స్థానికంగా ఓ కళాశాలలో ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నాడు. కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో ఇతడు ఈ దందాను నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది.

నిందితుడు డేరియస్‌తో పాటు నలుగురు విదేశీ మహిళలను పోలీసు