రేపు అనగా 13-11-2025 గురువారం ఉదయం 10 గంటలు కీ మన అవనిగడ్డ లో ఉన్న 1 వ వార్డు ప్రజలు గత 7 సంవత్సరాలు గా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తూ

భారత్ న్యూస్ గుంటూరు…రేపు అనగా 13-11-2025 గురువారం ఉదయం 10 గంటలు కీ మన అవనిగడ్డ లో ఉన్న 1 వ వార్డు ప్రజలు గత 7 సంవత్సరాలు గా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తూ , ఈ సంవత్సరం కూడా కోడూరు రోడ్డు లో మూడు బొమ్మలు సెంటర్, బస్ స్టాప్ పక్కన సందులో 8 వ సంవత్సరం కార్తీక వన సమారాధన కార్యక్రమం పుట్ట శ్రీను గురు స్వామి గారి పడి పూజా కార్యక్రమం, పోతురాజు గురు స్వామి భజన కార్యక్రమం , అయ్యప్పస్వాములు, భవానీలు,శివ స్వాములు,కుమార స్వాములు, గోవింద భక్తులు మరియు అందరి భక్తులు కీ సుమారుగా 2,000 నుంచి 2,500 మందికి అన్నసమారాధన నిర్వహించడం జరుగుతుంది.ఈ పడిపూజ,భజనా,సద్ది కార్యక్రమం కి మన అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు తనయులు యవనాయకులు మండలి వెంకట్రామ్ రాజాబాబు గారు కూడా విచ్చేయనున్నారు కావున మనందరం కూడా ఈ కార్తీకమాసంలో ఈ గొప్ప అవకాశాన్ని మనందరం కూడా తరలి వెళ్ళి తీర్ధ ప్రసాదాలు స్వీకరిద్దామని, అందుబాటులో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ..
ఇట్లు
యలవర్తి ఆది
1 వ వార్డు
అవనిగడ్డ