కారు నుండి దిగమని కోరినందుకు పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన యువతి

…భారత్ న్యూస్ హైదరాబాద్….కారు నుండి దిగమని కోరినందుకు పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడి చేసిన యువతి

ఉత్తరప్రదేశ్ – హర్దోయ్ జిల్లాలోని పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టి దాడి

కారులో సిఎన్జి నింపుతున్నప్పుడు పంప్ ఆపరేటర్ కారులో కూర్చున్న వ్యక్తులను కిందకు దిగమని కోరడంతో ఈ వివాదం

షాబాద్ ప్రాంతానికి చెందిన ఎహ్సాన్ ఖాన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిల్ గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండి రోడ్లోని పెట్రోల్ పంపుకు తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా, భార్య హు్‌స్న్ బానోతో కలిసి కారులో వచ్చారు

అయితే సిఎన్జి నింపుతుండగా, వారిని కారు నుంచి దిగమని కోరిన ఉద్యోగి రజనీష్ కుమార్

వారు దిగకపోవడంతో కారులో సిఎన్జి నింపడానికి నిరాకరించిన ఉద్యోగి రజనీష్ కుమార్

దీంతో ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టి దాడికి దిగిన యువతి

ఉద్యోగి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి.. యువతిని, ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని లైసెన్స్ పొందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు,