INS విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి.. PMO ఉద్యోగినంటూ కాల్!

భారత్ న్యూస్ ఢిల్లీ…..INS విక్రాంత్ ఎక్కడుందో చెప్పండి.. PMO ఉద్యోగినంటూ కాల్!

PM ఆఫీస్ అధికారినని, తనకు INS విక్రాంత్ గురించి సమాచారాన్ని అందించాలని నావల్ కమాండ్ కార్యాలయానికి కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని కోజికోడ్కు చెందిన ముజీబ్ రెహమాన్ PMO ఆఫీసర్ అంటూ నేవీ అధికారులకు కాల్ చేసి INS విక్రాంత్ ఎక్కడుందో తెలపాలని కోరాడు. అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.