మహబూబాబాద్ లో ఎండు గంజాయి స్వాధీనం

..భారత్ న్యూస్ హైదరాబాద్…మహబూబాబాద్ లో ఎండు గంజాయి స్వాధీనం

మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, కురవి గేట్ ప్రాంతాలలో ఎండుగంజాయి రైళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయసమాచారం మేరకు విస్తృత సోదాలు నిర్వహించారు. మహబూబాబాద్ లోని కురవి గేట్ రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్లపొదలమాటున (02) తెల్లటి ప్లాస్టిక్ సంచులలో (60) కిలోల ఎండు గంజాయి గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.
మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ & DTF- మహబూబాబాద్ సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరిగింది
ఈ..సోదాలలో ఎక్సైజ్ సిఐ లు చిరంజీవి, నాగేశ్వర్ రావు, నీరజ, ఎస్ఐలు చంద్రశేఖర్,అశోక్, కిరీటి, హెడ్ కానిస్టేబుల్ లు శ్రీనివాస్,మధు కానిస్టేబుల్ లు రాజు,శ్రీను,శేఖర్, ఇబ్రహీం, భవాని, నర్సింహా రావు, రవి సుమన్ పాల్గొన్నారు.