సికింద్రాబాద్‌లో బాహుబలి హెల్మెట్

భారత్ న్యూస్ హైదరాబాద్…సికింద్రాబాద్‌లో బాహుబలి హెల్మెట్

సికింద్రాబాద్ సంగీత్ క్రాస్‌రోడ్స్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ‘బాహుబలి హెల్మెట్’ను మల్కాజిగిరి CP సుమతి ఆవిష్కరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం, తీవ్ర గాయాలను తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సుమతి సూచించారు..