ఏపీలో జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు: మంత్రి సత్యకుమార్

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో జూన్ 7 నుంచి యోగా కార్యక్రమాలు: మంత్రి సత్యకుమార్

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో జూన్ 7 నుంచి 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు 2.5 లక్షల మందిని ఇందులో భాగస్వామ్యం చేయనున్నారు. మంతెన సత్యనారాయణ రూపొందించిన 21 వ్యాధుల నివారణ యోగా వీడియోల కోసం 81424 04888 నంబర్కు వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ చేసి లింక్ పొందవచ్చని పేర్కొన్నారు