భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల రెండో కనుమదారిలో ఎలుగబంటి
తిరుమల తిరుపతి :-
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో ఎలుగు బంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం వద్ద సంచరించింది. తినుబండారాల కోసం చెత్తకుండీల వద్ద తిరుగుతున్న ఎలుగ బంటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం తెలుసుకున్న అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎలుగు బంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు.