ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు

భారత్ న్యూస్ గుంటూరు…..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు నడుమ మసూల బీచ్ ఫెస్టివల్ – 2025 నిర్వహణ — జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.,

జిల్లా కలెక్టర్ గారితో కలిసి బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

క్రైమ్ న్యూస్ కృష్ణా. :

కృష్ణాజిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 5,6,7,8 తేదీలలో నిర్వహిస్తున్న మసూలా బీచ్ ఫెస్టివల్- 2025 ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్., గారు అన్నారు.

ఈరోజు మంగినపూడి బీచ్ ను జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ ఐఏఎస్ గారితో కలిసి ఎస్పీ గారు సందర్శించి వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.

నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ బీచ్ ఫెస్టివల్ కు జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు రానున్న నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..

▪️ఈ మసులా బీచ్ ఫెస్టివల్ వేడుకల నందు అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి కార్యక్రమం నిర్వహణకు అనేకమంది అతిధులు హాజరవుతారు కనుక ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

▪️ఈ వేడుకల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు జాతీయ రాష్ట్రస్థాయి క్రీడాకారులు హాజరవుతారు కనుక వారి రాకపోకలకు, భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాము.

▪️రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాలలో ప్రముఖులైన వారు హాజరవుతున్న నేపథ్యంలో వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది.

▪️సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజానీకం ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు నిర్ణయించడం అయినది.

▪️అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

▪️నాలుగు రోజులు పాటు నిర్వహించే ఈ బీచ్ ఫెస్టివల్ వేడుకలలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసామని, ఏదైనా సమస్య తలెత్తితే వెనువెంటనే పోలీస్ వారి సహాయం పొందవచ్చని తెలిపారు.

అనంతరం ఎస్పీ గారు పోలీస్ అధికారులకు, సిబ్బందికి అడ్మిన్ శ్రీ వి.వి. నాయుడు గారు, అడిషనల్ ఎస్పి ఏ ఆర్ సత్యనారాయణ గారితో కలిసి బ్రీఫింగ్ నిర్వహిస్తూ…

▪️నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలలో ఎలాంటి అవాంతాలు కలగకుండా సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించాలని తెలిపారు.

▪️ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన పాయింట్లలో ఉంటూ నిబద్ధతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

▪️ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లలో ఉన్న సిబ్బంది వచ్చే ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసేలా చూడాలని, ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు.