భారత్ న్యూస్ రాజమండ్రి…పశ్చిమ గోదావరి: ఇంట్లో రూ.2.27 కోట్ల నగదు స్వాధీనం!….
నరసాపురంలోభారీ స్థాయిలో నగదు తరలిస్తున్నారన్న సమాచారం ఆధారంగా పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల సందర్భంగా ఏకంగా ₹2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
ఆయన మీడియాకు వివరాలు వివరించారు.
మొదట్లో కేవలం ₹20 లక్షలు మాత్రమే వస్తాయని భావించినప్పటికీ, భారీ మొత్తంలో నగదు లభ్యమైంది.
దీని గురించి ప్రశ్నించగా, ఘంటా జాన్ బాబు సరైన సమాధానం ఇవ్వలేదు,

ఆ నగదును ఐటీ విభాగానికి అప్పగిస్తున్నారని సీఐ వెల్లడించారు….