భారత్ న్యూస్ రాజమండ్రి…అవనిగడ్డకు ఆరెంజ్ అలర్ట్.. 46.9 డిగ్రీల ఎండలు!
అవనిగడ్డ మండలానికి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ నెల 20న మండలం వ్యాప్తంగా 46.6 డిగ్రీల నుంచి 46.9 డిగ్రీల వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, దీనితో పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మంగళవారం ఇక్కడ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.బుధవారం ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
