భారత్ న్యూస్ శ్రీకాకుళం….దివిసీమ ఉప్పెన సమయంలో ఆర్థర్ పాల్ సేవలు చిరస్మరణీయం
-నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్
ఘనంగా దివి తాలూకా బేతేల్ వారి 54వ వార్షికోత్సవ వేడుకలు
అవనిగడ్డ:
దివిసీమ ఉప్పెన సమయంలో ఆర్థర్ పాల్ సేవలు చిరస్మరణీయం అని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం అవనిగడ్డ సీబీఎం స్కూల్ ఆవరణలో దివి తాలూకా బేతేల్ వారి 54వ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని క్రీస్తు సువార్త మహాసభలు నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ ఉప్పెన ప్రభావిత దివిసీమ పునర్నిర్మాణానికి మండలి వెంకట కృష్ణారావుకు తోడుగా నిలిచి ఆర్థర్ పాల్ అందించిన సేవలు స్మరించుకున్నారు. క్రీస్తు బోధనలు అనుసరించి దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను శ్యాముల్ ఆర్థర్ పాల్, పాల్ మేయర్, జార్జ్ ముల్లర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏజీపీ బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావు, నాయకులు డేగల రాఘవ, యలవర్తి ఆది పాల్గొన్నారు.
