ఏపీలో 38, తెలంగాణలో 26 స్థానాలు: అమిత్‌ షా

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో 38, తెలంగాణలో 26 స్థానాలు: అమిత్‌ షా

దిల్లీ: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయన్నారు. తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. తమిళనాడు, కర్ణాటకలోనూ సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు…