భారత్ న్యూస్ అనంతపురం.గత కొద్ది రోజులుగా ఒక తప్పుడు కేసు సృష్టించడానికి సిట్ అధికారులు తాపత్రయపడుతున్నారు. గత 12 నెలలుగా కొన్ని వందల మందిని విచారించినా ఎక్కడా లేని చెవిరెడ్డి పేరు ఏదో రకంగా లిక్కర్ కేసులో ఇరికించాలని, అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. అందుకోసం అనేకమంది అమాయకులను తీసుకువెళ్లి రహస్య ప్రదేశంలో పెట్టి వారికి నరకం చూపిస్తున్నారు. వారు కోరిన స్టేట్ మెంట్లు ఇవ్వాలని వారిని హింసిస్తున్నారు. డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ స్క్రిప్ట్ ప్రకారమే అంతా జరుగుతోంది. వీళ్లు ఎంతగా హింసించినా రేపు న్యాయమూర్తి ముందు బాధితులంతా వాస్తవాలు చెబుతారు.
-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి….
