సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా ప్రజాదర్బార్ : వీరంకి,కనపర్తి

భారత్ న్యూస్ రాజమండ్రి…సమస్యల సత్వర పరిష్కారానికి వేదికగా ప్రజాదర్బార్ : వీరంకి,కనపర్తి

అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి తక్షణ పరిష్కారమే ధ్యేయంగా స్థానిక రెవెన్యూ హాల్లో శుక్రవారం ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహించారు .ఈ వేదికకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ టిడిపి పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు హాజరయ్యారు.కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ స్థాయి సమస్యలపై ముఖ్య అతిథులకు వినతి పత్రాలను అందజేశారు. ప్రజా సమస్యలను ఓపికగా విన్న వీరంకి వెంకట గురుమూర్తి, కనపర్తి శ్రీనివాసరావులు .. అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని అని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు,మెండు లక్ష్మణరావు,బండే శ్రీనివాసరావు,మోర్ల రాంబాబు,రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపాముల స్వప్న,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు,కార్యదర్శి అవనిగడ్డ ప్రకాశం,శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ పాలకమండలి సభ్యురాలు విశ్వనాథపల్లి పాప తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు