వాణిజ్య సిలిండర్‌పై రూ. 183.50 తగ్గింపు

భారత్ న్యూస్ హైదరాబాద్ …వాణిజ్య సిలిండర్‌పై రూ. 183.50 తగ్గింపు

చమురు మార్కెటింగ్‌ సంస్థలు 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 183.50కి తగ్గించాయి. గత నెలలో రూ. 3,113కి చేరిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ. 2,930గా ఉంది. అలాగే ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పీజీ(ఎఫ్‌టీఎల్‌) సిలిండర్‌ ధర రూ. 13 తగ్గి, రూ. 808.50కి చేరింది.

గృహ వినియోగ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. అది రూ. 942గానే కొనసాగుతున్నది. ఇకపై ఏటీఎఫ్‌ ధరల పథకం కింద విమానయాన సంస్థలు మూడేండ్ల పాటు స్థిరంగా లీటరుకు రూ. 115 చొప్పున జెట్‌ ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు. నయారా ఎనర్జీ సంస్థ పెట్రోల్‌ ధరను లీటరుకు రూ. 5, డీజిల్‌ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గించింది.