యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్‌ నేతలు….

భారత్ న్యూస్ నల్గొండ…..యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్‌ నేతలు….

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులను సంప్రదించకుండానే నియామకాలను ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మంత్రి కొండా సురేఖను సైతం సంప్రదించలేదనే ఆరోపణల మద్య మరింత ముదిరిన వివాదం

తమకు తెలియకుండానే ఏకపక్షంగా నియామకాలు జరిగాయని తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు న్యూఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం

ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకటస్వామిని చేర్చడంతో, ఇప్పటికే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఉండగా, ఆయన కొడుకు ఎంపీ అవ్వగా మళ్లీ ట్రస్ట్ బోర్డులో స్థానం ఎలా కల్పించారని కాంగ్రెస్ నాయకుల అసంతృప్తి

మరోవైపు నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖను చేర్చడంతో ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం ఉన్న ఆమెకు స్థానం కల్పించారని తీవ్ర విమర్శలు

మాజీ బీఆర్ఎస్ ఎంపీ సోదరుడు సత్యనారాయణ రెడ్డిని ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించడం మరో వివాదం

ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించకపోతే, పెద్ద రాజకీయ సంక్షోభంగా మారవచ్చని కాంగ్రెస్ వర్గాల ఆందోళన…