పోలియో రహిత సమాజానికి కృషి: కృష్ణమనేని సావిత్రి
పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పోలియో చుక్కల కార్యక్రమం
రెండు చుక్కలతో పోలియో రహిత సమాజ స్థాపనకు నాంది పలుకుతూ చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి పాతూరు లో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం జరిగింది పోలియో రహిత సమాజం కోసం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించింది.ఈ కార్యక్రమంలో పాకాల సింగల్ విండో చైర్ పర్సన్ క్రిష్ణమనేని సావిత్రి, ఏఎన్ఎం లత, ఆశ వర్కర్ లావణ్య, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
