శ్రీశైలం డ్యామ్ దగ్గర 5కి.మీల భారీ ట్రాఫిక్.. అంతా ఆ బస్సు వల్లే!

భారత్ న్యూస్ రాజమండ్రి…శ్రీశైలం డ్యామ్ దగ్గర 5కి.మీల భారీ ట్రాఫిక్.. అంతా ఆ బస్సు వల్లే!

శ్రీశైలం డ్యామ్ దగ్గర 5 కిలోమీటర్ల మేరా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శ్రీశైలం జలాశయం మలుపు దగ్గర ఒక టూరిస్టర్ బస్సు బురదలో నిలిచిపోయింది. అది అటూ ఇటూ కదలట్లేదు.

దాన్ని కదపడం కుదరట్లేదు.

జలాశయం నుంచి అటువైపు దోమలపెంట చెక్ పోస్టు, ఇటువైపు సుండిపెంట వరకూ ట్రాఫిక్ జామ్ ఉంది. వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి ఉంది.

ఆ బస్సును పక్కకు జరిపితే తప్ప.. ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. కానీ అది సాధ్యం కావట్లేదు. ఇటీవల అక్కడ కురిసిన వర్షాల వల్ల కొంత బురద ఏర్పడింది. ఇప్పుడు అక్కడే

శ్రీశైలం డ్యామ్ దగ్గర అన్నీ మలుపులే ఉంటాయి. ఇటు తెలంగాణ, అటు ఏపీ.. రెండువైపులా.. ఘాట్ రోడ్డు నుంచి.. మలుపుల ద్వారా.. డ్యామ్ దగ్గరకు వాహనాలు వస్తాయి. డ్యామ్ పక్క నుంచి.. వెళ్తూ.. నదిపై ఉన్న వంతెనను దాటుతాయి. ఈ క్రమంలో.. రోడ్డు చిన్నగా ఉంటుంది. ఎక్కడైనా, ఏదైనా వాహనం ఆగితే, ఇక ఇబ్బందే. ఇప్పుడు అదే జరిగింది. దీని వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఆ బస్సును పక్కను తప్పించినా.. వెంటనే ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. ఎందుకంటే రెండువైపులా వాహనదారులు తామే ముందు వెళ్లాలని దూకుడుగా ముందుకొస్తారు. దాంతో.. ఎటూ ప్లేస్ ఉండదు. దాంతో ట్రాఫిక్ సమస్య వెంటనే తొలిగే అవకాశం తక్కువ. పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే.. రాత్రివరకూ పట్టే పరిస్థితులు ఉండగలవు. అందువల్ల శ్రీశైలం డ్యామ్ వైపుగా వెళ్లాలనుకునేవారు అప్రమత్తం అవ్వాలి.