జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, ప్రమాణ స్వీకారం!

భారత్ న్యూస్ అనంతపురం..కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ఎత్తులకు ఎట్టకేలకు తెరపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా వచ్చే నెల జూన్ 3వ తేదీన బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కర్ణాటక సీఎం పదవికి సిద్ధ రామయ్య రాజీనామా చేసిన సంగతి పాఠకులకు తెలిసింది, పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా హై కమాండ్ ఆదేశాల మేరకు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. గవర్నర్ కూడా సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు.

దీంతో డీకే శివకుమా ర్, సీఎం పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది, బెంగళూరులోని రాజ్ భవన్ గ్లాస్ హౌస్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాం గ్రెస్ ప్రజాప్రతినిధులు, అలాగే రాష్ట్రం నలు మూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ కార్య కర్తలు, అభిమానులు హాజరుకానున్నారు.