మోపిదేవి మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ రాజమండ్రి…మోపిదేవి మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

చరవాణిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి పంట నష్టం తీసుకెళ్లిన కనపర్తి శ్రీనివాసరావు

Ammiraju Udaya Shankar.sharma News Editor…పంట నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చిన కనపర్తి శ్రీనివాసరావు

మోపిదేవి, మే 30: ఇటీవల కురిసిన అకాల గాలివాన ధాటికి మోపిదేవి మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో శనివారం మండలంలోని బొబ్బర్లంక, నాగాయతిప్ప, మోపిదేవి లంక,కోసూరువారి పాలెం గ్రామాల్లో దెబ్బతిన్న అరటి, ములగ, బొప్పాయి పంట పొలాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా నేలకొరిగిన అరటి, ములగ, బొప్పాయి తోటలను కనపర్తి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్ట తీవ్రతను పరిశీలించారు . అరటి చెట్లు పండ్ల గెలలతో సహా విరిగిపడిపోగా, కోతకు సిద్ధంగా ఉన్న బొప్పాయి కాయలు రాలిపోయి తోటల్లోనే కుళ్ళిపోతున్న దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. గంటల తరబడి వీచిన గాలుల వల్ల 7 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కేవలం 20 రోజుల్లో చేతికి వస్తుందనగా ఇలా సర్వనాశనం అవ్వడంపై రైతులు శ్రీనివాసరావు ఎదుట ఆవేదన చెందారు . ఎకరాకు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు తీవ్ర అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల కష్టాలను, నష్టాలను ఆలకించిన కనపర్తి శ్రీనివాసరావు వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షం వల్ల అన్నదాతలు కోలుకోలేని దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన శాఖ అధికారులు వెంటనే మండలంలో దెబ్బతిన్న ప్రతి ఎకరాన్ని త్వరితగతిన సర్వే చేయాలని విజ్ఞప్తి చేశారు .ప్రకృతి వైపరీత్యం వల్ల సర్వస్వం కోల్పోయిన మోపిదేవి మండల రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని,నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండలం ఉద్యానవన శాఖ అధికారి రమేష్,మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి,పార్టీ నాయకులు పర్చూరి దుర్గాప్రసాద్,దాసినేని శ్రీనివాసరావు,దొప్పలపూడి జగదీష్,ముమ్మనేని బాబూరావు,కోనేరు నాగేశ్వరరావు,చందన రంగారావు,కోనేరు శివలీల,జన్ను వెంకటేశ్వరరావు,బళ్ల ప్రసాద్,కొమ్ము పవన్ కుమార్,పుప్పాల యేసు,గొరిపర్తి సత్యనారాయణ(కటారి),గవిని శివరామకృష్ణ,డోకిపర్తి బాలకోటేశ్వర రావు,యక్కటి హనుమాన్ తదితరులు పాల్గొన్నారు