ఎండలో తిరిగొచ్చిన వెంటనే చల్లటి నీళ్లను ఎందుకు తాగకూడదు?

భారత్ న్యూస్ రాజమండ్రి…ఎండలో తిరిగొచ్చిన వెంటనే చల్లటి నీళ్లను ఎందుకు తాగకూడదు?

ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పుల వల్ల జీర్ణక్రియ, గొంతు సమస్యలు వస్తాయి. అందుకే 10-15 నిమిషాలు విశ్రాంతి తీసుకుని, సాధారణ నీటిని నెమ్మదిగా తాగాలని NHM సూచించింది. అతి చల్లని పానీయాలకు దూరంగా ఉంటూ, సరైన పద్ధతిలో శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం ద్వారా వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి అనారోగ్యాలను సులభంగా నివారించొచ్చు.