భారత్ న్యూస్ గుంటూరు…అంబరాన్ని అంటిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ జన్మదిన వేడుకలు
భక్తి సంగీత విభావరి, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో సాంస్కృతిక శోభ
అభిమానుల భారీ కేక్ కటింగ్, బాణాసంచా మెరుపులు
హోరాహోరీ కబడ్డీ పోరాటాలతో క్రీడాభిమానుల కేరింతలు
అవనిగడ్డ:
గాంధేయవాది, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, తెలుగు భాషా సాంస్కృతిక రధసారథి అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి అంబరాన్ని అంటే స్థాయిలో జరిగాయి. స్థానిక ప్రభుత్వ కళాశాలలు, హైస్కూల్ క్రీడా మైదానంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు, నియోజకవర్గ మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు భారీ జనసందోహం మధ్య తెలుగు భాషా సంస్కృతులకు అద్దం పట్టే స్థాయిలో జరిగాయి. విజయవాడకు చెందిన వాగ్గేయకారులు కస్తూరి గోపాలరావు అన్నమయ్య, రామదాసుల సంకీర్తనలను ఆలపించి ప్రదర్శించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను తన్మయులను చేసింది. గాంధీ క్షేత్రం – ఈశ్వర్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు ఈశ్వర్, విశ్వ, తమ యువ, బాల కళాకారులతో అద్భుతమైన కూచిపూడి నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను మైమరిపించారు.
ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గాజుల పోతురాజు, సింహాద్రి పవన్ ఫ్రెండ్స్ సర్కిల్ నున్న సుబ్బారావు, చిలక శ్రీను, గుర్విందపల్లి అనీల్, చందన కిషోర్, దివి శ్రీను, కమ్మిలి రాజేష్, పాగోలు లంకేశ్వరరావు, బండే ప్రసన్న, పండ్రాజు చిట్టి, బండే ఫణి, తెనాలి సత్యవర్మ ఏర్పాటు చేసిన 70కేజీల భారీ కేకును అభిమానులు, క్రీడాకారుల శుభాకాంక్షల వెల్లువ మధ్య ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు కట్ చేసి పంచిపెట్టారు.
నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు చల్లపల్లి టీడీపీ నాయకులతో కలిసి వచ్చి మరొక కేక్ ఎమ్మెల్యేతో కట్ చేయించారు. రావెళ్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ రావెళ్ల ఉదయ్ కుమార్ తమ మిత్రబృందంతో వచ్చి మరో కేక్ ఎమ్మెల్యేచే కట్ చేయించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ బాణాసంచా వెలుగులతో అంబరాన్ని అంటే స్థాయిలో సంబరాలు చేశారు.
స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల సందర్భంగా మూడు రోజులుగా జరుగుతున్న మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ ఉమ్మడి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల నాకౌట్ పోటీలు చివరి రోజు రాత్రి హోరాహోరీగా సాగి క్రీడాభిమానులతో కేరింతలు కొట్టించాయి. ప్రధానంగా విశాఖపట్నం – గంగవరం, పలాస- విజయవాడ సాయి సెంటర్ జట్ల మధ్య జరిగిన సెమి ఫైనల్ పోటీలు, విశాఖపట్నం-పలాస మధ్య జరిగిన ఫైనల్ పోటీని వేలాది మంది క్రీడాభిమానులు అనుక్షణం ఉత్కంఠభరితంగా తిలకించారు. ఫైనల్ పోరుతో విశాఖపట్నం జట్టుపై పలాస జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు అనుక్షణం క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ ఫైనల్ పోరును నువ్వా నేనా అనే స్థాయిలో నడిపించారు.

అనంతరం ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టోర్నమెంట్ నిర్వాహకులు మండలి వెంకట్రామ్ విజేత పలాస జట్టుకు ట్రోఫీ, రూ.50వేలు నగదు బహుమతి, ద్వితీయ స్థానం పొందిన విశాఖపట్నం జట్టుకు ట్రోఫీ, రూ.40వేలు నగదు బహుమతి, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు ట్రోఫీ, రూ.30వేలు నగదు బహుమతి అందచేశారు. పోటీల్లో ఆద్యంతం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు. టోర్నమెంట్ మొదటి బహుమతి రూ.50వేలు మాచవరం జనసేన నాయకులు రెడ్రౌతు కృష్ణబాబు, రెండవ బహుమతి రూ.40వేలు టీఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు, వారి కుమారులు యువ హీరోలు రామ్-హరి అందచేశారు. మూడవ బహుమతి రూ.30వేలు చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన రావెళ్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్, టీడీపీ నాయకులు రావెళ్ల ఉదయ్ కుమార్, ఉత్తమ క్రీడాకారులకు దివి అనీల్ జ్ఞాపకార్ధం వారి మిత్రబృందం నగదు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన దాతలను, నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయులను, టోర్నమెంట్ నిర్వహణకు శ్రమించిన గ్రామీణ యువజన వికాస సమితి ప్రతినిధులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా సత్కరించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీని ఆదరిస్తున్న దివిసీమ ప్రజలను, టోర్నమెంట్ నిర్వహించిన మండలి వెంకట్రామ్ ను అభినందించారు. స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు సేవలు స్మరించుకున్నారు. తండ్రి బాటలో నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు విచ్చేసి పోటీలు తిలకించారు.
ఎంఈఓలు జీ.ఎన్.బీ.గోపాల్, సనకా శ్రీకాంత్, పీఈటీల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సింహాద్రి గంగాధర్, పీఈటీల అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు బడే వెంకటేశ్వరరావు, కార్యదర్శి బండే పాండులింగప్రసాద్, ట్రెజరర్ తోట నవీన్, ఫిజికల్ డైరెక్టర్లు చిల్లా సుబ్బారావు, మాదివాడ శ్రీనివాస పెరుమాళ్లు, ఎస్.ఈ.ఆర్.టీ ప్రొఫెసర్ మత్తి హరిగోపాల్, పీఈటీలు కోటగిరి ఫణింద్ర, అప్పికట్ల శ్రీహరి, అప్పికట్ల రామారావు, అప్పికట్ల తాతాజీ, అప్పికట్ల శ్రీధర్, సనకా రామారావు, అలపర్తి ఫణి, కోటగిరి గోపీ, కూనపరెడ్డి చందు, గరికపాటి మారుతీ, దోవా శేషగిరి, విశ్రాంత ఉపాధ్యాయులు కూనపరెడ్డి చంద్రశేఖర్, గ్రామీణ యువజన వికాస సమితి ప్రతినిధులు గుడివాక నరహరి, యలవర్తి సతీష్, గరికపాటి శ్రీను, సింహాద్రి పవన్, తుంగల నరేష్, బొప్పన భాను (ఎంపీటీసీ), నున్న వెంకట సుబ్బారావు, దివి శ్రీను, బచ్చు ఆదినారాయణ, యలవర్తి రాజేష్, గౌస్ కాటమ, తుంగల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.