భారత్ న్యూస్ హైదరాబాద్…ఎండ తీవ్రత.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు 60 మంది మృతి!
ఎండల తీవ్రతకు తెలుగు రాష్ట్రాల్లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న వడదెబ్బకు తెలంగాణలో 42, ఏపీలో 18 మంది చొప్పున మొత్తం 60 మంది మృతి చెందారు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండిపోతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది.
