భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి – ఏఏంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, ఏఏంసీ మాజీ ఛైర్మన్ తుమ్మల చౌదరి బాబు
కొడాలి – ఘంటసాల :-
ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఏంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, ఏఏంసీ మాజీ ఛైర్మన్ తుమ్మల చౌదరి బాబులు అన్నారు.
ఘంటసాల మండలం కొడాలి రైతు సేవా కేంద్రంలో 50 శాతం సబ్సీడీ పై రైతులకు పచ్చరొట్ట విత్తనాలను సోమవారం ఏఏంసీ చైర్మన్ కనకదుర్గ, మాజీ ఏఏంసీ ఛైర్మన్ చౌదరి బాబు, జనసేన మండల అధ్యక్షులు కోన రాజశేఖర్ చేతులు మీదగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మొవ్వ ఏడీఏ ఎస్.శ్యామల, మండల వ్యవసాయ శాఖ అధికారిణి డి. అనూషలు మాట్లాడుతూ ఘంటసాల మండలానికి 150 క్వింటాళ్ల జీలుగా, 75 క్వింటాళ్ల జనుము, 79 క్వింటాళ్ల పిల్లి పెసర ఏపీ సీడ్స్ వారు రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేశారన్నారు.
అవసరమైన రైతులు పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలని ఏవో అనూష తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొడాలి, చినకళ్లేపల్లి, చిట్టూర్పు వీఏఏలు చక్రవర్తి, కుమార్ సోమేశ్వర్, కె.సుబ్రహ్మణ్యేశ్వరి, రైతులు పాల్గొన్నారు.