కాపు రిజర్వేషన్ , రాజ్యాధికారం రక్షణ చట్టం (KRPS) ఆద్వర్యంలో ఈరోజు విజయవాడమీటింగ్ జరిగినది

భారత్ న్యూస్ గుంటూరు…కాపు రిజర్వేషన్ , రాజ్యాధికారం రక్షణ చట్టం (KRPS) ఆద్వర్యంలో ఈరోజు విజయవాడ గవర్నరుపేటలోని ప్రెస్ క్లబ్ నందు కాపు తెలగ బలిజ ఒంటరి సామాజికవర్గం వారికి రక్షణ చట్టాన్ని సాధించుటకు JAC మీటింగ్ జరిగినది. ఈ సభకు అత్యధిక సంఖ్యలో రాష్ట్రం నలుమూలలనుండి , తెలంగాణ నుండి కాపు సంఘ ప్రతినిధులు వచ్చి ప్రసంగించినారు

KRPS రాష్ట్ర అద్యక్షులు సనమల్ల ప్రసాద్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నికలముందు కాపులకు ఇచ్చిన వాగ్ధానాలను, కాపు రిజర్వేషన్ రక్షణ చట్టం, కాపు కార్పొరేషన్ కు నిదులు మంజూరు చేయుటలో అలసత్వం ప్రదర్శించుచు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోతున్నాయ. ప్రభుత్వం వెంటనే తెలుగు రాష్ట్రాల్లో 27% ఉన్న కాపులకు న్యాయం చేయాలని, మిగిలిన బోర్డు సభ్యులు, ముఖ్య అతిదులు పైన విషయములపై మాట్లాడినారు.

ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిధులుగా సాంబశివరావు, ఆమంచి సోమయ్య (JSP), గాదె వెంకటేశ్వర్లు (గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు), రాష్ట్ర కాపునాడు కార్యదర్శి, జనసేన సీనియర్ నాయకులు కొండవీటి కృష్ణమూర్తి, కాపు పొలిటికల్ చైర్మన్ వేల్పూరి శ్రీనివాసరావు, కాపు నాయకులు పాల్గొన్నారు