భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీఎఫ్డీసీ కమిటీలో పేట వాసులు
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎఫ్డీసీ నూతన కమిటీలో చిలకలూరిపేట ప్రాంతానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కమిటీలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ప్రముఖులు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. డాక్టర్ కందిమళ్ళ సాయిశివరావుతో పాటు, నాదెండ్ల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు శివాజీ శొంఠినేని, యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు వి.సముద్రలకు ఈ కమిటీలో స్థానం లభించింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు సినీ రంగానికి చెందిన ప్రముఖులకు రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రాతినిధ్యం లభించడంతో నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ ప్రాంత వాసులకు ఈ గుర్తింపు దక్కడం పట్ల స్థానిక గ్రామస్తులు, అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
