భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ మెట్రోకు ₹13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం.. తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి యాజమాన్యం

Ammiraju Udaya Shankar.sharma News Editor…హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ₹13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక వాయిదాల విధానంలో ఈ రుణ సౌకర్యం అందించబడుతుంది. ఈ ఒప్పందం తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సమక్షంలో జరిగింది.
ఈ రీఫైనాన్సింగ్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ 100 శాతం యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ అయ్యే అవకాశం కలిగిందని ప్రధాన కార్యదర్శి తెలిపారు.
