ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ‘భరోసా’ పేరిట సీసీ కెమెరాల ఏర్పాటు

భారత్ న్యూస్ వరంగల్ …ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ‘భరోసా’ పేరిట సీసీ కెమెరాల ఏర్పాటు

బస్సుల్లో జరిగే దొంగతనాలను అరికట్టడానికి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పసిగట్టేందుకు ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి.

బస్సుల్లో అమర్చిన ఈ కెమెరాల విజువల్స్ అన్నింటినీ ఆర్టీసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.

ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం 175 బస్సుల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్‌ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.