APRS ఫలితాలలో MPPS ఊటగుండం 100% స్ట్రైక్ రేట్.

భారత్ న్యూస్ గుంటూరు.APRS ఫలితాలలో MPPS ఊటగుండం 100% స్ట్రైక్ రేట్.

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు (AP RESIDENTIAL SCHOOLS) లో
నేడు విడుదలైన 5వ తరగతిలో ప్రవేశం కోసం జరిగిన ఏపీఆర్ఎస్ క్యాట్ ఎగ్జామ్ ఫలితాలలో MPPS ఊటగుండం కు చెందిన ఏడుగురు విద్యార్థులు మంచి మార్కులు సాధించి 1st లిస్ట్ లోనే ఏపీ ఆర్ ఎస్ స్కూల్లో సీట్లు సాధించడం జరిగింది.

మొత్తం ఏడుగురు విద్యార్థుల్లో నలుగురు బాలురు APRS పులిగడ్డ లోను, ముగ్గురు బాలికలు APRS  నిమ్మకూరులోనూ సీట్లు సాధించడం జరిగింది.

తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు చేసిన ప్రయత్నం విజయవంతం కావడంతో తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ఫలితాలపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
MEO -1
టి వి ఎం రామదాసు గారు MEO -2 కమ్ముల నాంచారయ్య గారు
EKDC చైర్మన్
దేవనబోయిన వెంకటేశ్వరరావు గారు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి కనకదుర్గ గారు SMC చైర్మన్ ఆరెవరపు గోపి రాజు తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పెరవలి రాంబాబు మరియు ఉపాధ్యాయులు నారేపాలెం రమేష్ ను అభినందించడం జరిగింది.
ఈనెల 15 నుండి 25వ తేదీ లోపు తగిన డాక్యుమెంట్లతో విద్యార్థులు సీటు పొందిన APRS పాఠశాలలో రిపోర్ట్ చేసి ప్రవేశం పొందుతారు