అక్రమ మద్యం విక్రయం – వ్యక్తి అరెస్ట్

భారత్ న్యూస్ వరంగల్….. .అక్రమ మద్యం విక్రయం – వ్యక్తి అరెస్ట్

సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మద్యం అక్రమ విక్రయాలపై ప్రత్యేక దాడులు కొనసాగుతున్నాయి.

శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో సిద్దవటం ఎస్‌.ఐ హారిక ఆధ్వర్యంలో దాడులు చేసి, నిందితుడి వద్ద నుంచి 13 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ హారిక మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలపై నిఘా పెంచినట్లు తెలిపారు….