..భారత్ న్యూస్ హైదరాబాద్…ర్యాగింగ్ భూతానికి ఉస్మానియా ఆసుపత్రి మెడికో బలి
కుల రిజర్వేషన్ వల్ల పీజీ సీటు వచ్చిందని వేధిస్తూ కావాలనే అధిక డ్యూటీలు వేస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న గిరిజన పీజీ విద్యార్థి
ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో మూడు నెలలుగా పీజీ క్వార్టర్స్‌లో ఉంటున్న జడ్చర్ల పరిధిలోని పాల్గడ్డ తండాకు చెందిన కాట్రావత్ సురేష్ నాయక్ అనే మెడికో
అయితే తనకు రిజర్వేషన్ వల్లనే పీజీ సీటు వచ్చిందని తరచూ సీనియర్లు వేధిస్తున్నారని, కావాలనే అధిక డ్యూటీలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని తల్లి నాగమణికి చెప్పి బాధపడిన సురేష్ నాయక్
నాగమణి సోదరుడు రవి హాస్టల్ వద్దకు చేరుకుని సురేష్‌కు ధైర్యం చెప్పి, ర్యాగింగ్ చేస్తున్న వారిని కలిసి మాట్లాడతానని చెప్పగా, నేనే చూసుకుంటాను మీరు రాకండి అని సురేష్ నాయక్ తెలిపినట్లు సమాచారం
గురువారం ఉదయం 7:30 గంటలకు డ్యూటీకి వెళ్తున్నానని తల్లికి చెప్పినా, 9 గంటలవుతున్నా తలుపు తెరవకపోవడంతో, గది వద్దకు వచ్చి చూసిన స్నేహితురాలు అమూల్య
తలుపు తీసి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్న సురేష్ నాయక్‌ను, అతని చుట్టూ నిద్ర మాత్రలు, చేతికి మత్తు ఇంజెక్షన్ గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించిన వైద్యులు
తమ కొడుకు మరణానికి సీనియర్లే కారణమని మార్చురీ వద్ద ఆందోళనకు దిగిన సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు
పీజీ పూర్తయ్యాక తండాలోని పేదలకు ఉచిత వైద్యం చేస్తానని చెప్పాడని మృతదేహం వద్ద విలపించిన సురేష్ నాయక్ తల్లి నాగమణి

నిందితులపై హత్యకేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సురేష్ నాయక్ కుటుంబ సభ్యులు.