ఈనెల 17న అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా..

భారత్ న్యూస్ రాజమండ్రి…ఈనెల 17న అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా..

-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.17.04.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేశారు.

ఈ జాబ్ మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోల్గేట్-పల్మోలివ్ లిమిటెడ్, అపోలో టైర్స్ లిమిటెడ్, ముత్తూట్ మనీ లిమిటెడ్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, మెడ్ప్లస్ ఫార్మసి, మోహన్ స్పింటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎమ్ సర్వీసెస్ లిమిటెడ్, సుధీర్ గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని, 600కు పైగా వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, ఏప్రియల్ 17న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 63006 18985, 79955 34572 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.