కొద్ది నిమిషాల్లోనే 130 టెస్టులు… ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంల రాక!

…భారత్ న్యూస్ హైదరాబాద్….కొద్ది నిమిషాల్లోనే 130 టెస్టులు… ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంల రాక!
తెలుగు రాష్ట్ర ప్రజలకు త్వరలోనే ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. ఈ యంత్రాలతో కేవలం కొన్ని నిమిషాల్లోనే 130 రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఆస్పత్రుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ టెక్నాలజీ మంచి ఫలితాలు ఇస్తోంది. BP, ECG, BMI, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ, థైరాయిడ్ వంటి ముఖ్యమైన టెస్టులు సులభంగా అందుబాటులోకి రానున్నాయి