భారత్ న్యూస్ విజయవాడ…29 మంది డీఎస్పీల బదిలీ..19 మందికి ఎసీపీవోలుగా అవకాశం
గుడివాడ డిఎస్పీగా పి.శ్రీనివాస్ నియామకం
అమరావతి: రాష్ట్రంలో 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ హరీష్కుమార్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వారిలో 19 మందిని వివిధ సబ్ డివిజన్లకు ఎల్డీపీవోలుగా (సబ్ డివిజనల్ పోలీసు అధికారులుగా) నియమించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలో (2018 నాటి నోటిఫికేషన్) డీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైన 25 మందిని హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల ప్రాధాన్య పోస్టుల్లో నుంచి తొలగించి అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఖాళీ అయిన కొన్ని సబ్డివిజన్లలో వేరేవారిని నియమించారు.మిగతా వారిని స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, ట్రాఫిక్ విభాగాల్లో డీఎస్పీలుగా బదిలీ చేశారు.