వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్

భారత్ న్యూస్ శ్రీకాకుళం….వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్

కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ దర్శించుకున్నారు.

దేవస్థానం వద్ద ధ్వజస్తంభ పునప్రతిష్ట మహోత్సవం, మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ట్రస్ట్రీ కోట పద్మావతి వరప్రసాద్, కోడూరుజనసేన పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, లింగారెడ్డి పాలెం పిఎసిఎస్ చైర్పర్సన్ కోట సుబ్బారావు, యువనేత బచ్చు వెంకటేష్, కాగిత రామారావు, పూత బోయన రతన కుమార్ తదితరులు ఉన్నారు.